హనుమాన్ వచ్చేస్తున్నాడు.. వినాయక చవితి నుండి షురూ

హనుమాన్ వచ్చేస్తున్నాడు.. వినాయక చవితి నుండి షురూ

టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth varma) నుండి వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హనుమాన్(Hanuman). యంగ్ హీరో తేజ సజ్జా(Teja sajja) హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలనున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక హనుమాన్ నుండి ఇప్పటికే రిలీజైన ఫస్ట్  గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్ళింది. గ్లింప్స్ లో విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉందటంతో అన్ని ఇండస్ట్రీల చూపు హనుమాన్ సినిమాపై పడింది. 

ఇందులో భాగంగానే హనుమాన్ గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా నేషనల్ ట్రెండ్ ఆవుతోంది. తాజాగా సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనులను వినాయక చవితి నుండి మొదలు పెట్టనున్నారట మేకర్స్. ట్విట్టర్ వైదికగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. దీంతో హనుమాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక హనుమాన్ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.