' హ్యాపీ బర్త్ డే ' ఫన్ బ్లాస్టింగ్ టీజర్..

' హ్యాపీ బర్త్ డే ' ఫన్ బ్లాస్టింగ్ టీజర్..

డిఫ్రెంట్ సబ్జెక్ట్స్తో సినిమాలు తీస్తూ..సైలెంట్గా సాలిడ్ హిట్లు కొడుతున్న డైరెక్టర్ రితేష్ రానా మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నాడు. లవ్లీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన హ్యాపీ బర్త్ డే మూవీ టీజర్ను  మేకర్స్ రిలీజ్ చేశారు. 

ఇంటింటికి గన్..ఎదురులేని ఫన్ అంటూ..మొదలయ్యే టీజర్లో వెన్నెల కిషోర్..నేను టెన్త్ ఫెయిల్ అయి ఉండొచ్చు..కానీ గన్ బిల్లు మాత్రం పాస్ చేయించే తీరుతా నంటూ చెప్పే డైలాగ్..సినిమాలోని కామెడీని రిఫ్లెక్ట్ చేస్తుంది.  ఇక ఈ మూవీలో త్రిపాఠీ డాన్సర్గా కనిపిస్తుంది. చివర్లో గన్తో లావణ్య చేసిన ఫైరింగ్..సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ నేపథ్యంలో  గన్స్ టాపిక్ ఏంటి..? డ్యాన్సర్ అయిన లావణ్య త్రిపాఠి గన్తో ఎందుకు ఫైరింగ్ చేయాల్సి వచ్చిందనేది..సినిమాపై సస్పెన్స్ను క్రియేట్ చేస్తున్నాయి. 

హ్యాపీ బర్త్ డే టీజర్ను చూస్తుంటే.. మత్తు వదలరా మూవీ టైప్లోనే హ్యూమర్ కూడా సాలిడ్గా ఉండేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ అందిస్తుండగా...మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జూలై 15న హ్యాపీ బర్త్ డే మూవీ రిలీజ్ కాబోతుంది.