హైదరాబాద్సిటీ, వెలుగు: నార్సింగి సెంట్రల్ కిచెన్లో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంతో పాటు, 15 కోట్ల సమిష్టి భోజనాల పంపిణీ పూర్తి చేసుకున్న సందర్భాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరై, వంటశాల సామర్థ్యాన్ని పెంచే ఆధునిక పరికరాలను ప్రారంభించారు. ఫౌండేషన్ సాధించిన ఈ మైలురాయిని ఆయన అభినందించారు.
