హ్యారీ పోటర్ నటుడు మృతి..

హ్యారీ పోటర్ నటుడు మృతి..

హాలీవుడ్ నటుడు, సర్ మైఖేల్ గాంబోన్(Michael Gambon)(82) ఏళ్ల వయసులో మృతి చెందారు. న్యుమోనియాతో బాధపడుతూ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హ్యారీ పోటర్(Harry Potter) సినిమా సిరీస్‌‌లో కీలక పాత్ర పోషించిన సర్ మైఖేల్ ప్రొఫెసర్ ఆల్బస్ డంబుల్ డోర్ క్యారెక్టర్ లో నటించి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యారు.  

హ్యారీ పోటర్ నుంచి వచ్చిన ఎనిమిది సీరిస్ లో ఆరింటిలో ప్రొఫెసర్ ఆల్బస్ క్యారెక్టర్ చేసినందుకు గాను అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాగే ఫెంటాస్టిక్ మిస్టర్ ఫాక్స్, ది సింగింగ్ డిటెక్టీవ్ వంటి మూవీస్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.

డబ్లిన్‌లో జన్మించిన సర్ మైఖేల్ తన ఐదు దశాబ్దాల కెరీర్‌లో టీవీ, సినిమా, థియేటర్, రేడియోలో పనిచేశాడు. కాగా ఆయన మరణ వార్తను అతని భార్య, కుమారుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన మృతికి హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

అతని ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్‌లో, మూడు ఆలివర్ అవార్డులు, రెండు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు అలాగే నాలుగు బాఫ్టా అవార్డులను అందుకున్నాడు. 1999లో నాటక రంగానికి సేవలందించినందుకు క్వీన్ ఎలిజబెత్ II చేత నైట్ బిరుదును పొందారు.