సెల్ఫ్​ కంట్రోల్ లేని మగవాళ్లే హిజాబ్​ను రుద్దుతున్నరు

సెల్ఫ్​ కంట్రోల్ లేని మగవాళ్లే హిజాబ్​ను రుద్దుతున్నరు

చండీగఢ్‌‌‌‌: హిజాబ్‌‌‌‌ అంశంపై హర్యానా హోం మంత్రి అనిల్‌‌‌‌ విజ్‌‌‌‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము నిగ్రహించుకోలేని మగాళ్లే హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తర్వాత ఆయన ఒక ట్వీట్‌‌‌‌ చేశారు. ‘‘ఆడాళ్లను చూడగానే ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేని మగాళ్లే హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తారు.

వారి ఆలోచనలు మారవు. అందుకే మహిళలకు శిక్ష విధిస్తున్నారు. తల నుంచి కాలి వరకు కప్పుకోవాలని ఆడవారిని బలవంతం చేస్తున్నారు. ఇది అన్యాయం’’అని ట్వీట్ చేశారు.