ఎత్తర జెండా: ఎంతో సాహసంతో దేశ భక్తిని చాటాడు

ఎత్తర జెండా: ఎంతో సాహసంతో దేశ భక్తిని చాటాడు

జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్నో పండుగలు వస్తుంటాయి. కానీ, దేశమంతా ఒక్కటై చేసుకునే పండుగలు రెండే రెండు. ఒకటి స్వాతంత్ర్య, రెండోది గణతంత్ర దినోత్సవం. స్కూల్స్​, కాలేజీలు, ఆఫీసులు, హాస్పిటల్స్.. ఎక్కడున్నాసరే మనవాళ్లు ఆ రోజుల్లో దేశభక్తిని చాటుకుంటారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనదేశ ప్రధాని జులైలో ‘హర్ ఘర్ తిరంగా’ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దాని మీద ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, ఇండియన్ కోస్ట్ గార్డ్​ ఉద్యోగి ఒకరు సముద్రం అడుగున జెండా ఎగరేసి తన దేశభక్తిని చాటాడు. దాన్ని వీడియో తీసి తన ట్విట్టర్​ అకౌంట్‌‌‌‌లో పోస్ట్ చేశాడు. దానికి ‘హర్ ఘర్ తిరంగా’, ‘ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​’ అని ట్యాగ్ చేసి, ఈ విషయం రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు.