బాబులూ విన్నారా : మందు ఎక్కువగా తాగితే నరాల వీక్ నెస్..

బాబులూ విన్నారా : మందు ఎక్కువగా తాగితే నరాల వీక్ నెస్..

చిన్న వయస్సులో ఎక్కువగా మద్యపానం చేయడం కండరాలు బలహీనతకు గురయ్యే ప్రమాదం ఉందని కొత్త పరిశోధన సూచిస్తుంది. UK-ఆధారిత యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అధ్యయనం ప్రకారం, కండరాలు తక్కువగా ఉన్న వ్యక్తులు రోజుకు 10 యూనిట్లు లేదా అంతకంటే ఎక్కువ తాగుతున్నారు. దాదాపు ఒక బాటిల్ వైన్ ను తాగే 50, 60 ఏళ్ల వయస్సులో ఉన్నవారు కండరాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటారని పరిశోధకులు తెలిపారు. "వయస్సు పెరిగే కొద్దీ కండరాలను కోల్పోయి, బలహీనత సమస్యలకు దారి తీస్తుంది" అని UEA నార్విచ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ ఐల్సా వెల్చ్ చెప్పారు.

దేశంలోని అర మిలియన్ల ప్రజల జీవనశైలి, ఆరోగ్యంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. 37 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 2లక్షల మంది వ్యక్తుల డేటాను పరిశీలించారు. వారు ఎంత ఆల్కహాల్ తాగుతున్నారన్న దానిపై అధ్యయనం చేసి, వారి శరీర పరిమాణాన్ని బట్టి వారి కండరాలతో పోల్చారు.

ఈ అధ్యయనం ప్రకారం,  తక్కువ తాగే వ్యక్తులతో పోలిస్తే అధికంగా మద్యం సేవించే వారిలో అస్థిపంజర కండరాలు తక్కువగా ఉంటాయి. రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లు తాగితే మద్యం సేవించడం ఓ సమస్యగా మారనుందని పరిశోధకులు తెలిపారు. అధిక స్థాయిలో మద్యం వినియోగం కండర ద్రవ్యరాశిపై హానికరమైన ప్రభావాలను చూపుతుందని అధ్యయనం చూపిస్తుంది.