భాగమతి దర్శకుడితో హీరో హావిష్

భాగమతి దర్శకుడితో హీరో హావిష్

ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా 'ఎస్ బాస్'. హావిష్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కు భాగమతి చిత్ర దర్శకుడు అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నాడు.

దర్శకుడు అశోక్ భాగమతి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర రెండో షెడ్యూల్ అక్టోబర్ మూడో వారం నుండి మొదలు కాబోతోంది. రవితేజ ఖిలాడి సినిమా తరువాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న సినిమా అవ్వడం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే డీజే టిల్లు కెమెరామెన్ సాయి ప్రకాష్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.