
నేచురల్ స్టార్ నాని(Nani) తను ఎంచుకునే కథల విషయంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలా ప్రతి మూవీలను ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ..అందరినీ తన నటనతో ఆకట్టుకుంటారు.ప్రస్తుతం నాని తండ్రి కూతుళ్ళ నేపథ్యంతో హాయ్ నాన్న మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, గ్లిమ్ప్స్, సాంగ్ ఆగిపోయాయి.
లేటెస్ట్ గా నాని మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. రేడియో జాకీ నిఖిల్ విజయేంద్ర సింహా తో కలిసి ట్రూత్ ఆర్ డేర్లో పాల్గొన్నారు. నాని తన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. ఫస్ట్ టైం చూడగానే మీరు ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని అడిగితే..నానీ క్రేజీ రెస్పాన్స్ ఇచ్చారు. అసలు ప్రేమ అంటే ఏంటో..ఈ మధ్యే తెలిసింది. అయితే..ఫస్ట్ టైం థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు సోనీ అనే అమ్మాయి అంటే క్రష్ ఉండేది. ఫస్ట్ టైం తనని చూసినపుడు సింపుల్గా ఫ్యాన్సీ డ్రెస్లో తెగ నచ్చిందని తెలిపారు.
కాగా కరెంట్ క్రష్ ఎవరనీ అడగగా.. కియారా ఖన్నా అని ఆన్సర్ ఇచ్చారు. ఈ కియారా ఖన్నా ఎవరని ఆలోచిస్తున్నారా? బాలీవుడ్..టాలీవుడ్ హీరోయిన్స్ కాదులేండీ..నాని ప్రజెంట్ మూవీ హాయ్ నాన్నలో యాక్ట్ చేసిన (నాని కూతురు) చైల్డ్ ఆర్టిస్ట్!. ఈ మూవీ షూటింగ్ టైంలో..ఓ రోజు ఆ అమ్మాయికి షూటింగ్ లేదు. భలే ముద్దుగా డ్రస్ వేసుకుని వచ్చింది. ఒకవేళ నేను కనుక కియారా ఏజ్ లో ఉంటే మాత్రం..తన మీద మనసు పారేసుకునేవాడిని. ఇది నా ఫస్ట్ క్రష్ అయ్యేది'' అని నాని చెప్పారు.
ఇక హాయ్ నాన్న మూవీకి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హెషమ్ అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నాడు. ఇతని మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదా..ఇదా.. ఇదే తొలిసారిలా.. పద..పదా ఏదే కుదిపానుగా..శ్వాసగా ' అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన సమయమా సాంగ్ ఆడియన్స్ ని వీపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ ఆల్బమ్ పై అంచనాలు పెరిగిపోయాయి. హాయ్ నాన్న అనే కూల్ టైటిల్ తో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. డిసెంబర్ 21వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.