తెలంగాణ పొలీసులు దేశంలోనే నెంబర్ వన్: మహమూద్ ఆలీ

తెలంగాణ పొలీసులు దేశంలోనే నెంబర్ వన్: మహమూద్ ఆలీ

తెలంగాణ పొలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. రవీంద్రభారతిలో ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ యూత్ డే సందర్భంగా సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ ఫామ్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అథితిగా పాల్గొన్నారు. సైబర్ అంబాసిడర్స్ ఫ్లాట్ ఫామ్ లోగోను మంత్రి మహమూద్ ఆలీ ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. టెక్నాలజీ కూడా పెరిగిందని.. దీంతో పాటు సైబర్ నేరాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. కరోనా టైం నుంచి సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ మేరకు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

ప్రజల కోసం పోలీసులు నిరంతరం పని చేస్తున్నారని మహమూద్ ఆలీ తెలిపారు. స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాల నియంత్రణ కోసం పని చేస్తారని.. సైబర్ అంబాసిడర్స్ కు సైబర్ కంట్రోల్ బాధ్యత ఉందని చెప్పారు. ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. పెట్రోల్ వెహికిల్స్ తరహాలో సైబర్ పెట్రోల్ వెహికిల్ కూడా వచ్చిందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీలో ముందు ఉండాలని చెప్పారు. సేఫ్టీ అంటే ఫిజికల్ నే కాకుండా.. డేటా,సెక్యూరిటీ ,సేఫ్టీలో ముందు ఉండాలన్నారు.