2026 నాటికి పూర్తిస్థాయి విద్యుత్​ ఎయిర్ ట్యాక్సీ సేవలు

2026 నాటికి పూర్తిస్థాయి విద్యుత్​ ఎయిర్ ట్యాక్సీ సేవలు

పూర్తి స్థాయి విద్యుత్​ ఎయిర్​ ట్యాక్సీ సేవలను భారత్​లో 2026 నాటికి ప్రారంభిస్తామని ఇండిగో మాతృ సంస్థ ఇంటర్చ్​ ఎంటర్​ప్రైజెస్​ వెల్లడించింది. ఇందుకోసం అమెరికా మాతృసంస్థ ఆర్చర్​ ఏవియేషన్​తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇంటర్​ గ్లోబ్​ ఎంటర్​ప్రైజెస్​కు ఆర్చర్​ ఏవియేషన్​ విద్యుత్‌ తో నడిచే 200 ఎలక్ట్రిక్​ వెర్టికల్ టేకాఫ్​ అండ్​ ల్యాండింగ్​ విమానాలను సరఫరా చేస్తున్నది.  ఆర్చర్​ ఏవియేషన్ ప్రస్తుతం అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్​ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​(ఎస్​ఏ)తో చర్చలు జరుపుతున్నది. తమ విమానానికి సర్టిఫికేషన్​ ప్రక్రియ తుది ద శల్లో ఉందని వచ్చే ఏడాదిలో సర్టిఫికేషన్ రావొచ్చని అనంతరం డైరెక్టరేట్​ జనరల్ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ (డీజీసీఏ) వద్ద అనుమతుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 

విద్యుత్​ ఎయిర్​ ట్యాక్సీలు

ఈ విద్యుత్ ట్యాక్సీల్లో పైలట్​తోపాటు నలుగురు ప్రయాణించొచ్చు. ఇవి హెలీకాప్టర్​ మాదిరిగా పనిచేస్తాయి. కానీ తక్కువ శబ్దం, అధిక భద్రతను కలిగి ఉంటాయి. 200 ఈవీటీఓఎల్​ల ధర దాదాపు బిలియన్​ డాలర్లు(రూ.8300 కోట్లు). ఢిల్లీతోపాటు ముంబయి, బెంగళూరుల్లో కూడా ఎయిర్​ ట్యాక్సీ సేవలను ప్రారంభించడానికి ఇంటర్​ గ్లోబ్​, ఆర్చర్​ ఏవియేషన్​ సంయుక్త సంస్థ చూస్తోంది.