చామరాజ నగర్​లోని ఓ బూత్​లో రీ పోలింగ్

చామరాజ నగర్​లోని ఓ బూత్​లో రీ పోలింగ్

బెంగళూరు: చామరాజ నగర్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని ఓ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది. హనూర్ అసెంబ్లీలోని ఓ బూత్​లో రీ పోలింగ్ నిర్వహించనున్నామని శనివారం ఈసీ ఓ లేఖలో పేర్కొంది. చామరాజ నగర్ లోక్ సభ జనరల్ అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్  సమర్పించిన రిపోర్టుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇండిగనాథ గ్రామంలోని గవర్నమెంట్ లోయర్ ప్రైమరీ స్కూల్ లో ఉన్న పోలింగ్ బూత్ నం–146లో  జరిగిన పోలింగ్ చెల్లదని ప్రకటించింది.

ఈ పోలింగ్ బూత్​లో 

ఈవీఎంలను కొంత మంది ధ్వంసం చేశారని చెప్పింది. ఈ నేపథ్యంలో అక్కడ  ఏప్రిల్ 29న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీ పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అంతకు ముందు ఇండిగనాథ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాలు సరిగ్గా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, స్థానిక అధికారులు బుజ్జగించడంతో ఓటెయ్యడానికి వారు అంగీకరించారు. కొంత మంది మాత్రం 
ఓటెయ్యడానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలను కొంత మంది ధ్వంసం చేశారు. దీంతో రీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది.