రేపే ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్.. భారత మహిళల జట్టు సెమీస్ చేరే మార్గం ఇదే!

రేపే ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్.. భారత మహిళల జట్టు సెమీస్ చేరే మార్గం ఇదే!

India Women Semi Final Scenarios: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లీగ్ దశ ముగింపునకు చేరడంతో సెమీ ఫైనల్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. టోర్నీలోని మొత్తం 12 జట్లలో గ్రూప్-బి నుండి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించగా, పాకిస్థాన్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లు టోర్నీ నుండి నిష్క్రమించాయి. గ్రూప్-A లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (8 పాయింట్లు), భారత్ (6 పాయింట్లు), దక్షిణాఫ్రికా (6 పాయింట్లు), బంగ్లాదేశ్ (4 పాయింట్లు) ముందంజలో ఉన్నాయి. జూన్ 28న జరగబోయే ఆస్ట్రేలియాతో మ్యాచ్ మన భారత జట్టుకు అత్యంత కీలకంగా మారింది. మిగిలిన మూడు సెమీస్ బెర్తుల కోసం ఏడు టీమ్‌లు పోటీపడుతుండగా, భారత్ సెమీ ఫైనల్‌కు చేరడానికి ఉన్న ముఖ్యమైన సమీకరణాలు ఇగో ఇట్లా ఉన్నాయి:

గ్రూప్-A నుంచి భారత్ సెమీస్ చేరే ఛాన్స్: 

* ఆస్ట్రేలియాపై భారత్ గెలిస్తే: జూన్ 28వ తేదీన జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ విజయం సాధిస్తే.. ఇరు జట్ల ఖాతాలో 8 పాయింట్లు చేరుతాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా కూడా తన చివరి మ్యాచ్ గెలిస్తే ఆ టీమ్‌కు కూడా 8 పాయింట్లు వస్తాయి. అప్పుడు నెట్ రన్‌రేట్‌లో ఏ జట్టు ముందుంటే వారికే సెమీస్ బెర్తు దక్కుతుంది.

* భారత్ ఓడిపోయి, దక్షిణాఫ్రికా కూడా ఓడిపోవాల్సిందే: ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్.. బంగ్లాదేశ్ చేతిలో దక్షిణాఫ్రికా రెండూ ఓడిపోతే మాత్రం సెమీస్‌కు వెళ్లే అవకాశాలు టీమిండియాకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నెట్ రన్‌రేట్‌లో భారత్ (+2.268) చాలా ముందుండగా, దక్షిణాఫ్రికా (+0.734), బంగ్లాదేశ్ (-0.849) వెనుకబడి ఉన్నాయి.

* భారత్ ఓడిపోయి, దక్షిణాఫ్రికా గెలిస్తే: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయి, బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే.. ఆసీస్, సౌతాఫ్రికాలు సెమీస్ చేరుతాయి. అప్పుడు భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా ఓడిపోతే మాత్రం భారత్ నెట్ రన్‌రేట్ ఆధారంగా ముందుకు వెళ్తుంది. 

గ్రూప్-B సెమీస్ ఛాన్స్: 

ఇంగ్లాండ్ సేఫ్: ఇంగ్లాండ్ (8 పాయింట్లు) ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధింంది.. కాబట్టి ఆ జట్టుకు తన ఆఖరి మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ఇబ్బంది లేదు.

* వెస్టిండీస్ సమీకరణం: ఇవాళ ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్ (6 పాయింట్లు) గెలిస్తే.. ఆ జట్టే నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. అప్పుడు న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తమ చివరి మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి ఇంటికి వెళ్తాయి. 
 
* శ్రీలంక ఆశలు: శ్రీలంక ఇప్పటికే ఐదు మ్యాచులు ఆడేసింది. ఒకవేళ విండీస్, కివీస్ (న్యూజిలాండ్) జట్లు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతేనే లంకకు సెమీస్ బెర్త్ దక్కే ఛాన్స్ ఉంటుంది.