బీసీలకు సీట్లు ఇస్తే చాలా? భాగస్వామ్యం వద్దా?: పొన్నాల లక్ష్మయ్య

బీసీలకు సీట్లు ఇస్తే చాలా? భాగస్వామ్యం వద్దా?: పొన్నాల లక్ష్మయ్య
  •  సొంత పార్టీ నేతలకు కాంగ్రెస్ నేత పొన్నాల ప్రశ్న 

న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికల సమయంలో బీసీలకు సీట్లు ఇచ్చాం అంటే సరిపోతుందా..? పార్టీలో ముందు నుంచి భాగస్వాములను చేయాల్సిన అవసరం లేదా అని సొంత పార్టీ నేతలను మాజీ పీసీసీ చీఫ్‌‌‌‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 1983 తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సగం స్థానాలు కూడా గెలవలేకపోయిందన్నారు.
 పార్టీకి బీసీలు దూరమయ్యారు అనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. దళిత సీఎం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల భూమి అనే హామీలతో కేసీఆర్ జనాన్ని నమ్మించారన్నారు. తెలంగాణ తెచ్చాను అన్న మాట ఉపయోగిస్తే.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అనే ఆలోచన ప్రజల్లో వస్తుందని తెలివిగా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. గతంలో ఎన్నికలకు కేవలం 40 రోజుల ముందు తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని, ఈ కొద్ది రోజుల్లో ఎన్నో ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.