ఓవర్ డ్రింకింగ్తో తల పట్టేస్తోందా.. సిట్టింగ్కు ముందు ఈ టిప్స్ పాటిస్తే హ్యాంగోవర్ సమస్యే ఉండదు !

ఓవర్ డ్రింకింగ్తో తల పట్టేస్తోందా.. సిట్టింగ్కు ముందు ఈ టిప్స్ పాటిస్తే హ్యాంగోవర్ సమస్యే ఉండదు !

ఏదైనా పార్టీ ఉన్నపుడు.. లేదా ఫ్రెండ్స్ తో కలిసినపుడు.. శాలరీ హైక్.. బోనస్.. లాభం.. నష్టం.. బాధ.. సంతోషం.. ఇలా ఏ మూడ్ ఉన్నా.. ఏ అకేషన్ అయినా మందేయటం కామన్. ఫ్రెండ్స్ తో సిట్టింగ్ లో కూర్చుంటే ఒక్కోసారి ఓవర్ లోడ్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే తల పట్టేసినట్లు.. అలసిపోయినట్లు.. బెడ్డు దిగలేని పరిస్థితి. ఇది మందుతాగే అందరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కునే సమస్యే. 

ఈ హ్యాంగోవర్ తో ఒక్కోసారి ఆఫీస్ డుమ్మా కొట్టి బాస్ తో చీవాట్లు పడుతుంటారు.. లేదంటే ఆ రోజు ప్లాన్ అంతా బెడిసికొట్టి సరిదిద్దుకోలేని నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు.. హ్యాంగోవర్ రాకుండా ఉండేందుకు.. సిట్టింగ్ కు ముందుగానే కొన్ని టిప్స్ పాటిస్తే మీ గ్లాస్ మేట్లకు మీరే ఆదర్శం అవుతారు. అదెలాగో చదవండి. 

హ్యాంగోవర్ రాకుండా సేఫ్ గా ఉండేందుకు డాక్టర్లు కొన్ని అద్భుతమైన చిట్కాలు చెబుతున్నారు. ఎంప్టీ స్టమక్ తో.. అంటే ఖాళీ కడుపుతో ఎప్పుడూ మందు తాగొద్దని చెబుతున్నారు. హై న్యూట్రిషన్స్ ఉండే ఆహారం తీసుకున్నాక డ్రింకింగ్ మొదలుపెట్టడం సేఫ్ అంట. 


ఈ కింది ఆహార పదార్థాలు మందు వెంటనే ఎక్కకుండా, హ్యాంగోవర్ కు దారితీయకుండా తోడ్పడతాయి. :

  • మల్టీ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం), క్వినోవా వంటి ఆహారాలు స్లో గా జీర్ణమవుతాయి. 
  • ఎగ్స్, గ్రిల్ల్ డ్ చికెన్ (కాల్చిన చికెన్), ఇతర ప్రోటీన్ ఫుడ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండేలా చేస్తాయి. 
  • ఆలివ్ ఆయిల్, అవకాడో, గుడ్ ఫ్యాట్స్.. బ్లడ్ ఆల్కహాల్ ను స్లోగా గ్రహించేలా చేస్తాయి.  

హైడ్రేట్గా ఉండేందుకు ట్రై చేయండి:

పార్టీ, సిట్టింగ్స్ సెలెబ్రేషన్స్ లో ఫుల్ ఎగ్జైట్మెంట్ కామన్. ఆ ఆనందంలో ఎక్కువ తాగేయటం సహజం. అయితే ఓవర్ డ్రింక్ వలన వెంటనే డీహైడ్రేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి సింపుల్ టెక్నిక్.. ఎక్కువగా వాటర్ తాగటం. ప్రతి పెగ్గుకు మధ్య మధ్యలో వాటర్ తీసుకోవటం వలన హైడ్రేటెడ్ గా ఉంటారు. మందు ప్లస్ వాటర్ తాగటం  వలన ఎక్కువ యూరినేషన్ జరుగుతుంది. దీని వలన పొటాషియం, సోడియం లవణాలు బ్లడ్ నుంచి యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోతాయి. అలాంటప్పుడు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోవడం సేఫ్. అంటే కొబ్బరినీళ్లు, తక్కువ షుగర్ ఉండే స్పోర్ట్స్ డ్రింక్.. మధ్య మధ్యలో తాగటం బెట్టర్. 

హెర్బల్ పద్ధతిలో హ్యాంగోవర్ రిలీఫ్:

పార్టీ చేసుకునే ముందు తీసుకునే జాగ్రత్తల్లో.. యాంటీ హ్యాంగోవర్ హెర్బల్ సొల్యుషన్ తీసుకోవడం మంచిది. దీని వలన నెక్స్ట్ మార్నింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటారట. 

చికోరీ, కర్జూర లివర్ డీటాక్సిఫికేషన్ కు తోడ్పడతాయి. అంటే లివర్ లో పేరుకుపోయిన మలినాలు, ఆల్కహాల్ ను బయటకు పంపిస్తాయి. 
కాల్మెఘ్ (నేలవేము) అనే మొక్క నుంచి తీసిన ఔషధం యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేస్తుందట. 
విటిస్ వినిఫెరా అనే గ్రేప్ ఔషధం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇవన్నీ హ్యాంగోవర్ రాకుండా ముందుగా వేసుకునే మందులాంటివి. 

ఒకే డ్రింక్ బెస్ట్.. నో మిక్స్:

చాలా మంది మందులో షుగరీ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి కలుపుకుంటారు. ఇది బ్లడ్ షుగర్ ను ఒక్కసారిగా పెంచేస్తుంది. దీని వలన అలసట, ఆయాసం, తలనొప్పి మొదలైన సమస్యలకు దారి తీస్తాయి. మరి కొందరు బీర్, హార్డ్ ఇలా అన్ని కలిపి కొడుతుంటారు. ఇది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నే క్రియేట్ చేస్తుంది. అందుకే మిక్సింగ్ అవాయిడ్ చేసి.. ఏదో ఒక దానికే ఫిక్స్ అయితే సగం సమస్యను అవాయిడ్ చేయవచ్చు.

మార్నింగ్ ఎలా మేనేజ్ చేయాలి:

నైట్ హెవీ డ్రింక్.. నిద్ర లేకపోవడం తో ఫుల్ హ్యాంగోవర్ కామన్. దీనికి సింపుల్ సొల్యుషన్స్ ఇవే:

ఉదయం లేవగానే గోరువెచ్చని  లెమన్ వాటర్ తాగటం వలన డీహైడ్రేషన్ పోయి.. రీ హైడ్రేట్ అవుతారు. అలాగే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. 
హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తో డే స్టార్ట్ చేయడం బెటర్. పాలకూర తో ఆమ్లెట్.. పెరుగు ఫ్రూట్స్ తో చేసిన స్మూత్ సలాడ్ లాంటిది మంచిది. 
కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేయడం వలన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మీ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. 

సో.. హ్యోంగోవర్ తో బాధపడేవారు డ్రింకింగ్ కు ముందు తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. లేదు ముందు కుదరటం లేదంటే తర్వాతైనా ఆ చిట్కాలు పాటించి రీఫ్రెష్ అవ్వండి.