డేంజరస్​  దోస్త్​ని గుర్తుపట్టడం ఎలా

డేంజరస్​  దోస్త్​ని గుర్తుపట్టడం ఎలా

ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక గోల్‌‌ ఉంటుంది. ఈ గోల్‌‌కి సపోర్ట్‌‌గా నిలిచేవాళ్లు, మోటివేట్ చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. ఆ లిస్ట్‌‌లో ఫ్రెండ్ ఒకడు. ఆ ఫ్రెండ్స్‌‌లో కొంతమంది టాక్సిక్ ఉంటారు. ఈ  టాక్సిక్ ఫ్రెండ్స్‌‌ మన జీవిత లక్ష్యాలకు ఎప్పుడూ సపోర్ట్‌‌గా ఉండకపోగా నెగిటివ్‌‌గా మాట్లాడుతుంటారు.  విచిత్రమేమిటంటే ఆ విషయం  మనక్కూడ తెలీదు. మరి  మనతోనే ఉంటూ వెన్నుపోటు పొడిచే అలాంటి టాక్సిక్​ ​ ఫ్రెండ్స్​ని పసిగట్టడం ఎలా…

దుర్మార్గపు మనస్తత్వం ఉన్న దోస్తులుంటే ఎప్పటికైనా ప్రమాదమే. వాళ్ల వల్ల ఎమోషన్స్‌‌ అన్ని ఆవిరైపోతాయి. రొమాంటిక్ రిలేషన్‌‌షిప్‌‌కి వచ్చేసరికి కొన్ని బౌండరీస్‌‌, ఎక్స్‌‌పెక్టేషన్స్‌‌ ఉంటాయి. కాబట్టి, పార్ట్‌‌నర్ డేంజరస్​ అనేది తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అదే ఫ్రెండ్ విషయంలో మాత్రం.. ఆ దుర్మార్గాన్ని పసిగట్టడం చాలా కష్టం. మరి ఆ దుష్టుల్ని ఎలా గుర్తించాలి? అంటే, దీనికి కొన్ని గుర్తులున్నాయి!

..దుర్మార్గపు బుద్ధి ఉన్న  ఫ్రెండ్స్​ ఎప్పుడూ  వాళ్ల ప్రాబ్లమ్స్​, స్ట్రగుల్స్​ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. సిచ్యుయేషన్​ ఏదైనా సరే అందులో దూరి వాళ్లని వాళ్లు హైలెట్​ చేసుకుంటారు. మన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. తెలుసుకోవాలని కూడా అనుకోరు. కనీసం మాట్లాడనివ్వరు కూడా. ఒకవేళ మనం ఏదైనా చెప్తున్నా  వినేందుకు ఇంట్రెస్ట్‌‌‌‌ చూపించరు.

..ఫ్రెండ్స్​తో  ఉంటే  గంటలు కూడా నిమిషాల్లా గడుస్తాయ్​. కానీ, ఫ్రెండ్​ అనే ముసుగులో మనతో కలిసిమెలిసి తిరిగే ఈ దుర్మార్గులతో  ఉంటే సంతోషం మాట అటుంచితే కనీసం మనశ్శాంతి కూడా ఉండదు. ఒకరకమైన బాధ,  నిరాశ ఉంటుంది.

..ఏదైనా సమస్యొచ్చినా, బాధనిపించినా ఇంట్లో వాళ్లకన్నా ముందు ఫ్రెండ్​కే ఫోన్​ కాల్ వెళ్తుంది. కానీ, ఫ్రెండ్ విలన్​ లాంటివాడైతే ​ అలాంటివేం ఉండవు. మనం వాళ్లతో నార్మల్​గా  మాట్లాడటానికి  కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. వాళ్లతో ఏదైనా విషయంలో వాదించాలన్నా ‘ఎందుకులే ఈ గొడవలన్నీ’  అనుకొని వదిలేస్తాం. అదే, నిజమైన ఫ్రెండ్‌‌‌‌ విషయానికొస్తే.. మనం ఏమన్నా అర్థం చేసుకుంటారు. వాళ్లతో మాట్లాడేటప్పుడు రెండోసారి ఆలోచించాల్సిన పనే లేదు.

..వీళ్లు మన టైమ్‌‌‌‌ గురించి అస్సలు ఆలోచించరు. ఏ విషయంలోనైనా సరే ప్లాన్ వేసుకునేటప్పుడు మనతో ఉంటారు.  అన్నింటికీ ‘సై’ అంటారు. కానీ, అనుకున్న టైమ్‌‌‌‌ దగ్గరకొచ్చాక లాస్ట్‌‌‌‌మినిట్‌‌‌‌లో ‘నో’ చెప్తారు. అలాగే ఎక్కడికెళ్లాలన్నా గంటలు గంటలు వెయిట్​ చేయిస్తుంటారు. ఇదేదో ఒకటి రెండుసార్లు అనుకుంటే పర్లేదు కానీ, ప్రతిసారి ఈ బిహేవియర్ రిపీట్ అవుతుంటుంది.

..వాళ్లు మన దగ్గర ఉంటే కంఫర్టబుల్‌‌‌‌గా ఫీలవ్వలేం.  వాళ్లు  మనతో ఉంటే బాగుండు అనే ఫీలింగ్‌‌‌‌ మనకు ఎప్పుడూ కలగదు.ఈ దుర్మార్గపు ఫ్రెండ్స్‌‌‌‌ ఎప్పుడూ మనకు రెస్పెక్ట్ ఇచ్చే ప్రయత్నమే చేయరు. వాళ్లు మనల్ని ఎప్పుడూ భయపడేలా, ఇన్‌‌‌‌సెక్యూర్‌‌‌‌‌‌‌‌ ఫీలయ్యేలా చేస్తుంటారు.

..డేంజరస్​  ఫ్రెండ్స్​ ఎప్పుడూ మనల్ని మాటలతో తికమకపెడుతుంటాడు. మనల్ని వెర్రివాళ్లలా  చూపిస్తుంటారు.  ఇతర ఫ్రెండ్స్‌‌‌‌ గురించి మొత్తం నెగెటివ్‌‌‌‌గా మాట్లాడుతుంటారు.  ఇది ఆ ధోరణికి సంకేతం!

..‘వాళ్లను  నమ్మొచ్చా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే  ‘బహుశా… నమ్మలేం’ అనిపిస్తే కచ్చితంగా వాళ్లు డేంజరస్​ ఫ్రెండ్స్​ అనే అర్థం.