Good Food : టమాటా కెచప్ తింటే.. మెటిమలు వస్తాయా.. బరువు పెరుగుతారా..?

Good Food : టమాటా కెచప్ తింటే.. మెటిమలు వస్తాయా.. బరువు పెరుగుతారా..?

టొమాటో కెచప్ లేకపోతే కొందరికి స్నాక్స్ తినబుద్ధి కాదు. ఇంకొందరైతే రుచి పేరిట కెచప్ ని అతిగా లాగించేస్తుంటారు. ఆ విషయంలో పిల్లలైతే మరీను. అయితే బేకరీలు, రెస్టారెంట్లు, మార్కెట్లో దొరికే టొమాటో కెచప్ సేఫ్ కాదన్నది ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. వాటిల్లో సాల్ట్, షుగర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, నిల్వ కోసం రకరకాల రసాయనాలు, రంగులు కలుపుతారని అంటున్నారు. బయట దొరికే కెచప్ ఎక్కువగా తింటే చర్మం పాడైపోవడం, మొటిమలు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయట. 

వాటిల్లోఉండే సోడియం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంత చెప్పాక కూడా కెచప్ పై ఇష్టం పోలేదంటారా? దానికి ఓ ప్రత్యామ్నాయ మార్గం ఉంది. ఇంట్లోనే సులభంగా టొమాటో కెచపిని తయారు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. టొమాటో, వెల్లుల్లి, కొంచెం ఉప్పు, షుగర్, వెనిగర్ తో టొమాటో సాస్న తయారు చేసుకోవచ్చు. 

టొమాటోలకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఎండు మిర్చి, ఉప్పు, మిరియాల పౌడర్, బెల్ పెప్పర్ చేర్చి మెక్సికన్ స్పెషల్ 'టొమాటో సాల్పా'ని సిద్ధం చేసుకోవచ్చు. పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలను టొమాటో లతో చేర్చి చేసుకునే దేశీ రెసిపీ 'టొమాటో చట్నీ' ఉండనే ఉంది.