ముక్కలుముక్కలైన డెడ్ బాడీలు

ముక్కలుముక్కలైన డెడ్ బాడీలు
  • ముక్కలుముక్కలైన డెడ్ బాడీలు
  • నాగ్ పూర్ పేలుడులో హృదయవిదారక దృశ్యాలు 
  • ఇప్పటి వరకు 50 పార్ట్స్ గుర్తింపు 

నాగ్ పూర్: నాగ్ పూర్ ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయినోళ్ల డెడ్ బాడీలు ముక్కలుముక్కలయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పేలుడు ధాటికి బిల్డింగ్ మొత్తం కూలిపోయిందని, కార్మికుల డెడ్ బాడీలు ఛిద్రమయ్యాయని అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల కింద ఉన్న పార్ట్స్ ను వెలికితీస్తున్నామని చెప్పారు. 

ఇప్పటి వరకు 50కి పైగా పార్ట్స్ దొరికాయని పేర్కొన్నారు. దొరికిన పార్ట్స్ ను ప్యాకెట్లలో భద్రపరిచి, పోస్టుమార్టం కోసం పంపిస్తున్నామని వెల్లడించారు. డీఎన్ఏ టెస్టు ఆధారంగా మృతులను గుర్తించి, ఆ బాడీ పార్ట్స్ ను కుటుంబసభ్యులకు అప్పగిస్తామని వివరించారు. ఘటనా ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తున్నామని, డెడ్ బాడీల పార్ట్స్ ను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. 

ఈ ఘటనను కౌన్సిల్​లో ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే బ్లాస్ట్ జరిగిందని మండిపడ్డాయి. సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీలో భద్రతాపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, నాగ్ పూర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించి 9 మంది కార్మికులు చనిపోయారు.