సన్ ఎన్​ఎక్స్​టీతో ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌స్ట్రీమ్ ప్లే ఒప్పందం

సన్ ఎన్​ఎక్స్​టీతో ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌స్ట్రీమ్ ప్లే ఒప్పందం

చెన్నై: టెలికాం మేజర్ భారతీ-ఎయిర్‌‌‌‌టెల్ బుధవారం తన వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌స్ట్రీమ్ ప్లే, బ్రాడ్‌‌‌‌కాస్టర్ సన్ టెలివిజన్ నెట్‌‌‌‌వర్క్ లిమిటెడ్  ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫారమ్ అయిన సన్ ఎన్​ఎక్స్​టీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

ప్రాంతీయ కంటెంట్ లభ్యతను పెంచడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఎయిర్​టెల్​ తెలిపింది. ఒప్పందం ప్రకారం, ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌స్ట్రీమ్ ప్లే కస్టమర్‌‌‌‌లు సన్ ఎన్​ఎక్స్​టీ నుంచి 50 వేల గంటల కంటే ఎక్కువ కంటెంట్‌‌‌‌ను చూడవచ్చు. ఇందులో పలు భాషల్లో సినిమాలు,  టెలివిజన్ షోలు ఉంటాయి. ఈ భాగస్వామ్యం వల్ల ప్రతి యూజర్ ఎయిర్‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌స్ట్రీమ్ ప్లే యాప్​/వెబ్​లోనే సన్​ఎన్​ఎక్స్​టీ కంటెంట్​ను చూడవచ్చు.  సింగిల్ సబ్‌‌‌‌స్క్రిప్షన్ సరిపోతుంది.