వరుసబెట్టి సచ్చిపోతున్న కుక్కలు

వరుసబెట్టి సచ్చిపోతున్న కుక్కలు
  • నార్వేలో అంతుచిక్కని వ్యాధితో ౩౦ కుక్కలు మృతి
  • ఇప్పటికే ఆస్పత్రులకు 200 కుక్కలు
  • వ్యాధి తమకూ వస్తుందేమోనని భయపడుతున్న ప్రజలు

డజన్ల కొద్ది కుక్కల్ని ఆస్పత్రిపాలు చేస్తున్న ఓ అంతుచిక్కని వ్యాధి నార్వే జనాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచి వాంతులు, బ్లెడ్‌ మోషన్స్‌తో వెటర్నిటీ హాస్పటల్స్‌కు తీసుకొస్తున్న కుక్కల సంఖ్య నార్వేలో వందలు దాటింది. ఆ జబ్బేంటో తేల్చలేక డాక్టర్స్‌ సైతం తలలు పట్టుకుంటున్నారు. తొలుత ఓస్లో టౌన్‌కే పరిమితమైన ఈ వ్యాధి క్రమంగా దేశం మొత్తం వ్యాపిస్తోంది. సుమారు 200 కుక్కల వరకు ఒకే వ్యాధి లక్షణాలతో హాస్పటల్స్‌కు చేరాయి. ఇందులో 30 వరకు చనిపోయాయి. దీంతో నార్వేలోని డాగ్స్‌ ఓనర్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఎందుకు చనిపోతున్నాయని తెలుసుకునేందుకు సెర్చింగ్‌ మొదలు పెట్టారు. ఇటువంటి సమస్యలకు ఆన్సర్‌ చేసే కెన్నెల్‌ క్లబ్‌ వెబ్‌సైట్‌ కూడా ప్రశ్నల తాకిడికి క్రాష్‌ అయింది. నార్వే వెటర్నరీ ఇనిస్టిట్యూట్‌ బోర్టు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. దీనిపై ఎమర్జెన్సీ అండ్‌ సెక్యూరిటీ డైరెక్టర్ జోరున్ జార్ప్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆరోగ్యకరమైన నార్వేజియన్ కుక్కలు ఇంత త్వరగా చనిపోవడం ఆందోళన కలిగించే అంశమే’నన్నారు. ఇప్పటివరకు విరేచనాలకు కారణమయ్యే రెండు రకాల బ్యాక్టీరియాలనే జబ్బు పడిన డాగ్స్‌ నుంచి కనుగొన్నారు. పుట్టగొడుగులు, ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియాలు, పరాన్న జీవుల వల్ల ఈ వ్యాధి సోకి ఉంటుందా? అనే కోణంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ వ్యాధి తమకెక్కడ అంటుకుంటుందోనని కుక్కల్ని చూస్తేనే నార్వే జనం ఆమడదూరం పరుగుపెడుతున్నారు.