హైదరాబాద్ జిల్లాలో సర్ 51 శాతమే.. ముషీరాబాద్, సనత్ నగర్, మలక్ పేట్లల్లో 46 శాతమే.. మరో వారమే గడువు

హైదరాబాద్ జిల్లాలో సర్ 51 శాతమే.. ముషీరాబాద్, సనత్ నగర్, మలక్ పేట్లల్లో 46 శాతమే.. మరో వారమే గడువు
  • ముషీరాబాద్, సనత్ నగర్, మలక్ పేట్లల్లో 46 శాతమే
  • స్పీడప్​ చేయడానికి నోడల్ ఆఫీసర్ల నియామకం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్) కేవలం 51 శాతం మాత్రమే పూర్తయ్యింది. మరో వారం మాత్రమే గడువు మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి రంగంలోకి దిగారు. కొందరు బీఎల్వోలు ఒకే ప్రాంతంలో కూర్చొని ప్రజలు వస్తే ఫామ్‌‌‌‌‌‌‌‌లు తీసుకుంటున్నారని తెలియడం, ఫోన్ ​చేసినా స్పందించడం లేదని సమాచారం అందడంతో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన ప్రతి ఓటరును కలిసి ఫిల్ చేయించి తీసుకోవాలని ఆదేశించారు. ఫీల్డ్‌లో పనిచేసిన వివరాలు, కలిసిన ఓటర్ల సంఖ్య, సేకరించిన ఫామ్‌‌‌‌‌‌‌‌ల వివరాలను రోజువారీగా నమోదు చేయాలని ఆర్డర్​ ఇచ్చారు.

నోడల్ అధికారుల నియామకం..
హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 51 శాతం డిజిటలైజేషన్ మాత్రమే పూర్తవడంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి జీహెచ్ఎంసీలోని అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్ వోడీలను ప్రత్యేక నోడల్ ఆఫీసర్లుగా నియమించారు.

15 నియోజకవర్గాలకు గాను 15 మందికి బాధ్యతలు అప్పగించారు. ఈ అధికారులు రోజూ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌కు వెళ్తూ బీఎల్వోల పనితీరును పరిశీలిస్తారు. ఫామ్‌‌‌‌‌‌‌‌ల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పురోగతిపై ప్రత్యక్షంగా సమీక్షిస్తూ ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించే చర్యలు చేపడతారు.

డిజిటలైజేషన్ ​స్పీడప్​ చేసేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ సెటప్​చేశారు. ఏ బూత్‌‌‌‌‌‌‌‌లో ఎంత శాతం పూర్తయ్యింది? ఎన్ని ఫామ్‌‌‌‌‌‌‌‌లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి? ఏ ప్రాంతాల్లో స్పందన తక్కువగా ఉంది? అనే అంశాలను సమీక్షిస్తారు. పనితీరు వెనుకబడిన బూత్‌‌‌‌‌‌‌‌లపై ప్రత్యేక దృష్టి పెడుతూ అవసరమైన చోట అదనపు సిబ్బందిని వినియోగించే అవకాశాలను పరిశీలిస్తారు.

ఇక్కడ 50 శాతం దాటలే..
ఇప్పటివరకు నమోదైన వివరాల ప్రకారం బహదూర్‌‌‌‌‌‌‌‌పురా నియోజకవర్గంలో 56 శాతం, చాంద్రాయణగుట్టలో 55 శాతం, జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో 47 శాతం, ముషీరాబాద్, సనత్‌‌‌‌‌‌‌‌నగర్, మలక్‌‌‌‌‌‌‌‌పేట్ నియోజకవర్గాల్లో 46 శాతం మేర ప్రక్రియ పూర్తయింది. ఇక ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటర్లు (ఏఎస్‌‌‌‌‌‌‌‌డీ) అన్నీ కలిపి సుమారు 40 శాతం వరకు ఓట్లు తొలగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత సిటీలో జరిగే ఎన్నికల్లో 90శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుందని, గతంలో జరిగిన ఎన్నికల్లో పర్సంజెట్ తగ్గడానికి ఏఎస్‌‌‌‌‌‌‌‌డీ ఓటర్లే కారణమని తెలుస్తోంది.

సర్ ప్రక్రియను పరిశీలించిన కర్ణన్​ 
సర్​ ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్​ఎప్పుడూ ఫీల్డ్లోనే ఉంటున్నారు. ఆదివారమైనా కూడా సనత్ నగర్ నియోజకవర్గంలోని శివాబాగ్ కాలనీ, దాసరం బస్తీ హట్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.