హైదరాబాద్లో కరెంట్ కోతలు లేవు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్లో కరెంట్ కోతలు లేవు: మంత్రి పొన్నం ప్రభాకర్
  • మరమ్మతుల కోసమే స్వల్ప విద్యుత్ అంతరాయం 

హైదరాబాద్లో కరెంట్ కట్ అంటూ వస్తున్న వార్తలపై హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. విద్యుత్ లైన్ల, సబ్ స్టేషన్ ల నిర్వహణ & మరమ్మత్తు పనుల షెడ్యూల్ రూపొందించారని తెలిపారు. వినియోగదారుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ వ్యవధిలో పనులు పూర్తి చేస్తామన్నారు.

జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆదివారం, పండగ రోజులు మినహాయించి విద్యుత్ నిర్వహణ పనులు జరుగుతాయన్నారు.  రోజుకు కేవలం 15 నిమిషాల నుంచి 2 గంటల లోపుగా నిర్వహణ పనులు పూర్తీ చేసేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. రెండు గంటలకు మించి కరెంట్ పోతే అధికారులకు మెమోలు కూడా జారి అవుతాయని మంత్రి పొన్నం అన్నారు. 

రొటేషన్ పద్దతిలో విద్యుత్ నిర్వహణ పనులు 

రాబోయే వేసవిలో అధిక విద్యుత్ డిమాండ్ దృష్ట్యా నిర్వహణ మరమ్మతు పనులు చేపట్టాం.. నిర్వహణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కొంత విద్యుత్ అంతరాయం ఉంటుందని అన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో 11 కేవీ ఫీడర్లు 2వేల 400 ఉన్నాయి. ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ లో TSSPDCL మరమ్మతులు చేపట్టేవారు. ఈ సారి ఎన్నికల కారణంగా పనులు జనవరిలో సాగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

 ప్రతి రోజు 100 ఫీడర్ల పరిధిలో రెండు గంటల్లోపు మాత్రమే విద్యుత్ కి అంతరాయం ఏర్పడుతుందని ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.