గండిపేట: జీతం డబ్బుల కోసం వెళ్లి వ్యక్తి మిస్సింగ్

గండిపేట: జీతం డబ్బుల కోసం వెళ్లి వ్యక్తి మిస్సింగ్

గండిపేట, వెలుగు: జీతం డబ్బులు తెచ్చుకుంటానని వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో చోటుచేసుకుంది. హైదర్‌‌గూడ కు చెందిన జి.జగన్‌‌ సెక్యూరిటీగార్డుగా చేస్తున్నాడు. ఆయన భార్య గతంలోనే మృతిచెందగా ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 23న ఉదయం 8 గంటల సమయంలో తన తమ్ముడి బైక్ తీసుకొని తెలిసిన వ్యక్తి శ్రీనివాస్‌‌తో కలిసి జీతం డబ్బులు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. 

రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికి, బంధువుల ఇండ్లలో ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో ఠాణాలో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌‌ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.