హైదరాబాద్ మెట్రోకు మస్తు ఆదరణ

హైదరాబాద్ మెట్రోకు మస్తు ఆదరణ
  • సగటున రోజూ 2.3 లక్షల మంది ప్రయాణం
  • బుధవారం ఒక్కరోజే 2.6 లక్షల మంది రైడ్

ఎండ ప్రభావం కావొచ్చు.. ట్రాఫిక్ చిక్కులు తప్పుతయని కావొచ్చు.. మెట్రోకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. రైళ్లలో రద్దీ ఎక్కువవుతోంది. సగటున రోజూ 2.3 లక్షల మంది మెట్రోలో హాయిగా, హ్యాపీగా రైడ్ చేసేస్తున్నారు. ప్రతి వారం అదనంగా నాలుగు వేల మంది ప్యాసింజర్లు చేరుతున్నారు. 17న (బుధవారం) ఒక్కరోజే 2.67లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. ఐపీఎల్​ మ్యాచ్ ఉండడమూ ప్రయాణికులు పెరగడానికి కారణమైంది. దాదాపు 21 వేల మంది ప్రయాణికులు ఐపీఎల్​ మ్యాచ్ కోసం ఉప్పల్​ వరకు మెట్రోలో వెళ్లా రు. ఐటీ కారిడార్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం 12 కంపెనీలు ఇప్పటికే మెట్రో స్టేషన్ల వరకు ఫ్రీ షటిల్స్​ నడుపుతున్నాయి. తాజాగా ఎల్​ అండ్ టీ  కూడా దుర్గంచెరువు నుంచి షటిల్​ బస్సులను ప్రారంభించింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ ఏరియాలో ఉద్యోగుల కోసం ఉచితంగా సేవలు అందిస్తోంది. 15 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటాయని మెట్రో సంస్థ తెలిపింది.

ఐపీఎల్ మ్యాచ్ ల కారణంగా మెట్రో వినియోగం పెరిగిందని,ఐటీ ఉద్యోగులకూ మెట్రోనే ప్రధాన రవాణావ్యవస్థగా మారిందని సంస్థ తెలిపింది. అందుకే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పిం ది.