పారిస్​ ఒలింపిక్స్​కు మన​ శ్రీజ

పారిస్​ ఒలింపిక్స్​కు మన​ శ్రీజ

న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్‌‌లో బరిలోకి దిగే ఇండియా టేబుల్‌‌ టెన్నిస్‌‌ టీమ్స్‌‌ను గురువారం ప్రకటించారు. తెలంగాణ స్టార్‌‌ ప్లేయర్‌‌ ఆకుల శ్రీజ విమెన్స్‌‌ జట్టులో చోటు సంపాదించింది. మెన్స్‌‌, విమెన్స్‌‌లో మొత్తం ఆరుగురు ప్లేయర్లను ఎంపిక చేశారు. శ్రీజతో పాటు మనిక బాత్రా, ఆర్చన కామత్‌‌ ఇందులో ఉన్నారు. ప్రత్యామ్నాయ ప్లేయర్‌‌గా ఐహిక ముఖర్జీకి చాన్స్‌‌ ఇచ్చారు.

ఇక మెన్స్‌‌లో శరత్‌‌ కమల్‌‌, హర్మిత్‌‌ దేశాయ్‌‌, మనవ్‌‌ ఠక్కర్‌‌ బరిలోకి దిగనున్నారు. ఆల్టర్‌‌నేట్‌‌ ప్లేయర్‌‌గా సత్యన్‌‌ను తీసుకున్నారు. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో శరత్‌‌, హర్మిత్‌‌, విమెన్స్‌‌లో శ్రీజ, మనిక పోటీపడనున్నారు. లేటెస్ట్‌‌ వరల్డ్‌‌ ర్యాంకింగ్స్‌‌ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2004లో ఆట మొదలుపెట్టిన 41 ఏళ్ల శరత్‌‌కు ఇదే చివరి ఒలింపిక్స్‌‌. ఇప్పటికి నాలుగుసార్లు బరిలోకి దిగాడు.