బంపరాఫర్ : రూ.59లతో హైదరాబాద్ మెట్రోలో సిటీ అంతా తిరిగేయొచ్చు

బంపరాఫర్ : రూ.59లతో హైదరాబాద్ మెట్రోలో సిటీ అంతా తిరిగేయొచ్చు

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  రూ. 59లతో హైదరాబాద్ మెట్రోలో నగరమంతా ప్రయాణించే అవకాశాన్ని  కల్పించింది. ఆగస్టు 12, 13, 15వ తేదీల్లో రూ. 59 రూపాయల టికెట్ కొనుగోలు చేసి అపరమితంగా ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చని ప్రకటించింది. 

సూపర్ సేవర్..
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడర్ ఆఫర్ పేరతో ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 12, 13, 15వ తేదీల్లో రూ. 59లతోనే మెట్రో రైల్లో ప్రయాణించొచ్చు. సూపర్ సేవర్ మెట్రో హాలిడేకార్డును రీలోడ్ చేయడం ద్వారా ఈ  ఆఫర్ ను పొందొచ్చు.