స్టార్టప్​ బ్రికోతో..యువతకు ఉపాధి

స్టార్టప్​ బ్రికోతో..యువతకు ఉపాధి

హైదరాబాద్​, వెలుగు:  రియల్‌‌ ఎస్టేట్‌‌ బ్రోకరేజ్​ సర్వీసులు అందజేసే హైదరాబాద్​ స్టార్టప్​ బ్రికో లోకల్ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈ రంగంలో ఎన్నో అద్బుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపింది.  తాము ఆస్తుల కొనుగోలుదారులకు,  అమ్మకందారులకు 0 శాతం బ్రోకరేజ్ ఫీజుతో సేవలను అందిస్తామని పేర్కొంది.  ఎలాంటి ఖర్చులూ లేకుండా స్థిరాస్తి క్రయవిక్రయాలకు వినూత్న పరిష్కారాలను అందిస్తుంది. దీని ద్వారా ఫ్రెష్​ గ్రాడ్యుయేట్‌‌లకు ఉద్యోగావకాశాలు కల్పించాలనేది ఈ స్టార్టప్‌‌ టార్గెట్​.

అవినీతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌‌ హైటెక్ సిటీలో జరిగిన యువజన సదస్సులో బ్రికో ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 50 మందికి పైగా యువ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా కొన్ని కొత్త మార్గాలను అన్వేషించడం ఈ సదస్సు వెనుక ప్రధాన ఉద్దేశమని బ్రికో ఫౌండర్​ మణిదీప్ కావలి అన్నారు. అవినీతి, అక్రమాల కారణంగా మనదేశంలో యువతకు సరిగా ఉపాధి దొరకడం లేదన్నారు.