నిబంధనలకు విరుద్ధంగా హారన్ మోగిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మే 4వ తేదీ గురువారం చంచల్ గూడ చౌరస్తాలో మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల హారన్లను తొలగించారు.
అలాగే పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలపై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలో దేవరకొండ నుంచి బీఆర్ఎస్ సభకు తరలి వెళుతున్న జీపులను పోలీసులు తనిఖీ చేయగా..పలు వాహనాలపై పెండింగ్ చాలన్లు ఉన్నాయి. దీంతో చాలన్లు కట్టించుకొని పంపించారు.

