బెంగళూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టాడు.
ఐపీఎల్‌లో క్రిస్ గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. సాయి సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్ రీచ్ అయ్యాడు. ఇక, బంతుల పరంగా (1361 బంతులు) ఐపీఎల్‌లో అత్యంత వేగంగా రెండు వేల పరుగుల చేసిన జాబితాలో సాయి సుదర్శన్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు.
►ALSO READ | రాజస్థాన్తో మ్యాచ్కి ముందు సన్‌రైజర్స్కు అదిరిపోయే న్యూస్.. కమిన్స్ ఎంట్రీకి లైన్ క్లియర్
అభి కేవలం 1193 బంతుల్లోనే రెండు వేల పరుగుల రేర్ ఫీట్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా మూడు (2024, 25, 26) సీజన్లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గాను సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఒక్క క్రిస్ గేల్ మాత్రం వరుసగా మూడు (2011,12, 13) సీజన్లలో సెంచరీ బాదాడు.
ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు:
- ఆటగాడు ఇన్నింగ్స్
- సాయి సుధర్సన్ 47
- క్రిస్ గేల్ 48
- షాన్ మార్ష్ 52
- రుతురాజ్ గైక్వాడ్ 57
- కేఎల్ రాహుల్ 60

