RCB vs GT: ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాక్షిగా జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు మరో 18.5 ఓవర్లలోనే ఛేదించి అభిమానులను ఖుషీ చేసింది. 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాకబ్ బెతెల్ (14) సిరాజ్ బౌలింగ్‌లో త్వరగానే అవుట్ అయ్యాడు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కలిసి గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 115 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి పునాది వేశారు.
కోహ్లీ-పడిక్కల్ షో:
కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 55 పరుగులు చేసిన తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్‌లో దేవదత్ పడిక్కల్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించిన విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 81 పరుగులు), సెంచరీ దిశగా సాగుతూ 154 పరుగుల వద్ద జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో పెవిలియన్ కి చేరుకున్నాడు. మధ్యలో కెప్టెన్ రజత్ పాటిదార్ (8), జితేష్ శర్మ (10) తక్కువ పరుగులకే అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. కానీ, చివరి ఓవర్లలో కృనాల్ పాండ్యా (17), టిమ్ డేవిడ్ (9) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
అయితే గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు గుజరాత్ తరపున సాయి సుదర్శన్ చేసిన అద్భుత సెంచరీ (205/3) వృథాగా మిగిలిపోయింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
HOW DID THAT GO FOR A SIX! 🫣
— IndianPremierLeague (@IPL) April 24, 2026
🎥 Even Tim David is surprised with that shot 😮
Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @RCBTweets pic.twitter.com/sk3Nli4jtD

