2027 ODI World Cup: 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత క్రికెట్‌లో ఒకే ఒక్క ప్రశ్న తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వరల్డ్ కప్ ఆడతారా?.. ఇటీవలి కాలంలో వన్డేల్లో ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, వారి వయసు దృష్ట్యా సెలెక్టర్లు యంగ్ టీమ్‌ను వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాబోయే ప్రతీ వన్డే సిరీస్ ఈ ఇద్దరు దిగ్గజాలకు కీలకంగా మారింది.
వాళ్లు ఆడితే కప్ మనదే:
రోకో (RoKo) జోడీ భవితవ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ వారికి పూర్తి మద్దతుగా నిలిచాడు. రేవ్‌స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీబ్ మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లీలు భారత క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్లు.. వన్డే క్రికెట్‌లో ఇప్పటికీ వారు అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. 2027 ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఆడితే భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆటగాళ్ల ఎంపికకు వయసు కాదు, మైదానంలో వారు ఇచ్చే ప్రదర్శన మాత్రమే కొలమానం కావాలని తేల్చి చెప్పాడు.
రికార్డులే సమాధానం.. ఇద్దరూ టాప్:
కేవలం పేరుకే కాకుండా, మైదానంలో పరుగుల వరద పారిస్తూ తమ స్థానాన్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరూపించుకుంటూనే ఉన్నారు. 2025 నుంచి వీరిద్దరి వన్డే ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..
ALSO READ : ఐసీసీ నెంబర్ 1 వన్డే బ్యాటర్గా శుభ్‌మన్ గిల్..
* విరాట్ కోహ్లీ: 2025 నుంచి ఆడిన 19 వన్డేల్లో 64.69 సగటుతో ఏకంగా 1,035 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి.
* రోహిత్ శర్మ: 2025లో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అందించిన రోహిత్ భాయ్, గత ఏడాది నుంచి 42.11 సగటుతో 379 రన్స్ సాధించాడు.
సౌతాఫ్రికా పిచ్‌లపై రోకో అనుభవం:
2027 వన్డే ప్రపంచకప్ ప్రధానంగా దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. ఆఫ్రికా మైదానాల్లోని పేస్, సీమ్ పరిస్థితులకు అలవాటు పడి, అక్కడ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండటం చాలా అవసరం. వేగవంతమైన పిచ్‌లపై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోగల రోహిత్, కోహ్లీల సుదీర్ఘ అనుభవం మెగా టోర్నీలో టీమిండియాకు అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.
