V6 News

ఫిలింనగర్‌లో బెంజ్ కారు బోల్తా.. గచ్చిబౌలిలో కారు పార్కింగ్ విషయంలో డీజే ఆపరేటర్ హంగామా

ఫిలింనగర్‌లో బెంజ్ కారు బోల్తా.. గచ్చిబౌలిలో కారు పార్కింగ్ విషయంలో డీజే ఆపరేటర్ హంగామా

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ లో బెంజ్ కారు బోల్తా పడడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు ఓవర్ స్పీడుతో ఒక్క సారిగా బోల్తా పడి పల్టీలు కొట్టింది. 2026 ఏప్రిల్ 24న జరిగిన ఈ ఘటనతో ఫిలింనగర్ ఏరియాలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

TG 09 HT 5341 నంబర్ గల Mercedes‑Benz car రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు యజమాని వాహనాన్ని అక్కడికక్కడే వదిలేసి పరారయ్యాడు.  కారు రోడ్డుపై ఉండటంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ క్లియర్ చేశారు. అలాగే కారు యజమాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గచ్చిబౌలిలో డీజే ఆపరేటర్ హంగామా 

గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో డీజీ ఆపరేటర్ ప్రతాప్ రెడ్డి నానా హంగామా చేశాడు. కారు పార్క్ చేయకూడదు అని చెప్పడంతో బ్యాంక్ సెక్యూరిటీ పై తీవ్రంగా దాడి చేశాడు. నాకే అడ్డుచెబుతావా అంటూ ఆవేశంగా కుడి చేతితో ఎల్బో పంచ్ ఇచ్చాడు. దీంతో సెక్యూరిటీ గార్డ్ ఘన్సం సదా కిందపడిపోయాడు. 

►ALSO READ | నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మందికి గాయాలు

ప్రతాప్ రెడ్డి దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బ్యాంక్ సిబ్బందిపైన కూడా దాడికి దిగాడ్ ప్రతాప్. ఘనటకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.  బాధితుడి భార్య రేఖ దేవి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 118(1) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితుడు ఘన్సం కుమార్ నానక్ రామ్ గూడ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. డీజే ఆపరేటర్ పై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నిందితునిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.