నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును లారీ ఢీ కొట్టింది. 2026 ఏప్రిల్ 24న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ 44 నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
44వ జాతీయ రహదారిపై ప్రయాణికులను దించేందుకు ఆగిన బస్సును లారీ వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్క కుదుపుతో ప్రాయాణికులు ముందుకు పడిపోయారు. కొందరు ముందు సీట్లకు గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని సీట్లు విరిగిపోయి ప్రయాణికులు మధ్యలో ఇరుక్కున్నారు.
ముందు సీట్లు, రాడ్లు గుద్దుకుని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు వెనక భాగం డ్యామేజయ్యింది. బస్సు అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన 20 మందిని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రాణనష్టం లేదని పోలీసులు చెప్పారు. లారీ డ్రైవర్, ఓనర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
►ALSO READ | పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తి

