రూ.500 వీకెండ్ ఛాలెంజ్..! చేతిలో ఐదొందలు ఉంటే హైదరాబాద్‌లో వీకెండ్ తిని తిరగొచ్చు.. ఎలా అంటే..

రూ.500  వీకెండ్ ఛాలెంజ్..!  చేతిలో ఐదొందలు ఉంటే హైదరాబాద్‌లో వీకెండ్ తిని తిరగొచ్చు.. ఎలా అంటే..

హైదరాబాద్‌లో రూ.500 బడ్జెట్‌తో వీకెండ్‌ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది ఎక్కడికి వెళదామా? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ టాప్ 5 బడ్జెట్ టూరిస్ట్ స్పాట్స్​ మీకోసమే. అతి తక్కువ బడ్జెట్‌లో సిటీలో తిరిగేందుకు, ఫేమస్ ఫుడ్​ ఆస్వాదించేందుకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇది. ఓ లుక్కేయండి !

హైదరాబాద్‌‌‌‌లోనే అతిపెద్ద సోలార్ సైక్లింగ్ ట్రాక్ పై పర్యావరణ హితమైన రైడ్ కోసం ‘స్మార్ట్ బైక్ పాయింట్’ నుంచి రూ.100ల అద్దెకు తీసుకొని తిరిగి రావొచ్చు. దుర్గం చెరువులో బోటింగ్ చేస్తూ ప్రశాంతమైన సరస్సు దృశ్యాలు, నగర అందాలను ఆస్వాదించవచ్చు. బోటింగ్ చార్జీ ఒక్కొక్కరికి కేవలం రూ.100 మాత్రమే! ఫ్లిప్‌‌‌‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌‌‌‌లో గో-కార్టింగ్ -రూ.250 (ఒక్కరికి) లేదా రూ.350 (జంటకు)తో థ్రిల్లింగ్ రైడ్. 

ఉస్మాన్ సాగర్  గండిపేట పార్క్ లో సూర్యాస్తమయం రూ.50 ప్రవేశ రుసుంతో విశాలమైన పార్క్, ప్రశాంతమైన వాతావరణం, అందమైన ప్రకృతిని అస్వాదించవచ్చు. ఐమాక్స్​లో స్కేరీ హౌస్​లో రూ.100తో సరదా అనుభవం పొందొచ్చు. మరీ భయంకరంగా ఉండదు కానీ స్నేహితులతో నవ్వుతూ గడపడానికి భలే ఉంటుంది!

వీకెండ్ డే ఎంజాయ్..
కేవలం 500 రూపాయల బడ్జెట్‌‌‌‌తో సరదాగా ఒకరోజు ఇలా ప్లాన్ చేయొచ్చు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ + టీ: రూ.100–150, సాలార్ జంగ్ మ్యూజియం సందర్శన: రూ.50 ప్రవేశ రుసుం. నెక్లెస్ రోడ్డు దగ్గర ఉచితంగా ఈవెనింగ్ వాక్ చేయొచ్చు. స్ట్రీట్ స్నాక్స్ : రూ. 100–150, ఐస్ క్రీం లేదా ఫాలూదా : రూ.100 –150, మొత్తం ఖర్చు: సుమారు రూ.450–500. కొంచెం డిఫరెంట్ ఎక్స్​పీరియెన్స్ కావాలంటే వీకెండ్‌‌‌‌లో రూ.199–రూ.499 మధ్య వెల్‌‌‌‌నెస్, పెయింటింగ్, డ్యాన్స్ లేదా పాటరీ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లు కూడా సిటీలో తరచుగా జరుగుతుంటాయి. సాయంత్రం వేళల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి లైటింగ్ అద్భుతంగా ఉంటుంది.

►ALSO READ | డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివేనా..? రోజుకు ఎంత తినాలి..?

సిటీ టూర్, స్ట్రీట్ ఫుడ్..
చార్మినార్ అండ్ లాడ్ బజార్ నుంచి ఉదయాన్నే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ప్రవేశ టిక్కెట్: రూ.25. చార్మినార్ లోపలికి వెళ్లి పై అంతస్తు నుండి పాతబస్తీ అందాలను చూడొచ్చు. ఉదయపు టిఫిన్ చార్మినార్ సమీపంలో ప్రసిద్ధ ఇడ్లీ, దోశ లేదా నిమ్రా కేఫేలో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు రూ.50. మధ్యాహ్నం చార్మినార్ నుంచి కొద్ది దూరంలో ఉన్న మూసీ నది ఒడ్డున గల సాలార్ జంగ్ మ్యూజియాన్నిసందర్శించండి. ఇక్కడి ప్రపంచ ప్రసిద్ధ కళాఖండాలు, క్లాక్ షో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

ఎంట్రీ టికెట్: రూ.50. మధ్యాహ్న భోజనం: పాతబస్తీలోని స్థానిక హోటళ్లలో లేదా స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ లేదా వెజ్ మీల్స్ – రూ.50. దుర్గం చెరువు లేదా గండిపేట పార్క్​లో సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం హైటెక్ సిటీ వైపు వెళ్లొచ్చు.

మెట్రో, షేరింగ్ ఆటోలు, సొంత వాహనం లేదా క్యాబ్‌‌‌‌లు వాడితే బడ్జెట్ దాటిపోతుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ఉపయోగించండి. ఎన్టీఆర్ గార్డెన్ / లుంబినీ పార్క్ ఎంట్రీ ఫీజు రూ.30 – రూ.50 మధ్య ఉంటుంది. ఇవేకాకుండా హైదరాబాద్ నగరంలో ప్రశాంతమైన ఉచిత సందర్శన ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చాలెంజ్‌‌‌‌లో మీ లక్ష్యం రూ.500 దాటకుండా ఒక పూర్తి వీకెండ్ డే ఎంజాయ్ చేయొచ్చు.