డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివేనా..? రోజుకు ఎంత తినాలి..?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివేనా..? రోజుకు ఎంత తినాలి..?

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. అయితే, వీటిలో సహజంగానే చక్కెర, కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే, వీటిని ఎంత మోతాదులో తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, డ్రై ఫ్రూట్స్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే రోజుకు 30 నుంచి 40 గ్రాములు అంటే ఒక చిన్న గుప్పెడు లేదా పావు కప్పు తినడం చాలా మంచిది.

రోజు మోతాదు ఎంత ఉండాలి?
వివిధ ఆరోగ్య సంస్థల నిపుణుల సిఫార్సుల ప్రకారం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సిన పరిమితి:
*అమెరికా (US FDA) & అంతర్జాతీయ నిపుణులు ప్రకారం రోజుకు 40 గ్రాముల వరకు పెద్దలకు అనుకూలంగా ఉంటుంది.
*బ్రిటన్ (NHS) ప్రకారం రోజుకు 30 గ్రాములు అంటే ఉదాహరణకు 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష, 2 అంజూర పండ్లు లేదా 3 ఎండు ఖర్జూరాలు.
*భారతీయ పోషకాహార నిపుణుల ప్రకారం రోజు శారీరక శ్రమను బట్టి రోజుకు 20–30 గ్రాములు తీసుకోవడం మంచిది. గుండె ఆరోగ్యం కోసం తీపి కలపని, ఎలాంటి కెమికల్స్  లేని డ్రై ఫ్రూట్స్ రోజుకు 30-40 గ్రాములు తీసుకోవడం ఉత్తమం.

ఒక్కోసారి ఎంత తినవచ్చో అంటే :
*ఒక నిండు టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష
*2 ఎండిన అంజూర పండ్లు 
*3 ఎండు ఖర్జూరాలు
*ఒక చిన్న గుప్పెడు నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్

మోతాదు మించకూడదని ఎందుకు అంటారంటే 
*పండ్లను ఎండబెట్టడం వల్ల వాటిలోని నీరంతా ఆవిరైపోయి, కేవలం చక్కెర (ఫ్రక్టోజ్ & గ్లూకోజ్) గాఢత చాలా పెరుగుతుంది.
* కేవలం 30 గ్రాముల డ్రై ఫ్రూట్స్ లోనే సుమారు 80 నుండి 100 పైగా కేలరీలు ఉంటాయి.
*ఇవి జిగటగా ఉంటాయి కాబట్టి, తిన్న తర్వాత సరిగ్గా నోరు కడుక్కోకపోతే  దంతాల సమస్యలు,  పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంది.
*మధుమేహం (షుగర్ వ్యాధి) ఉన్నవారు వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.

►ALSO READ | రైనీ స్నాక్స్ : రుచితో పాటు ఆరోగ్యం.. బీరకాయ.. వామాకు బజ్జీలు.. అదిరిపోయే టేస్ట్..!