నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని నేషనల్ హైవేల్లో యాక్సిడెంట్లకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్ వద్ద పరిస్థితులు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా ఫండ్స్ మంజూరు చేసిందని ఎంపీ అర్వింద్ తెలిపారు. శుక్రవారం మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. మొత్తం రూ.1023 కోట్లతో వంతెనలు, బైపాస్, రోడ్ల అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ జిల్లాలో 78, జగిత్యాల జిల్లాలో 107 బ్లాక్‌స్పాట్స్ ఉన్నాయన్నారు. ఎన్‌హెచ్ 63, 61, 44పై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద పరిస్థితిని సమూలంగా మార్చి ప్రజలు క్షేమంగా ప్రయాణించేలా చేస్తామని తెలిపారు.
