15 రోజుల్లోనే ఇంగ్లాండ్కి షాక్.. నెంబర్-1 ప్లేస్ కైవసం చేసుకున్న భారత్

15 రోజుల్లోనే ఇంగ్లాండ్కి షాక్.. నెంబర్-1 ప్లేస్ కైవసం చేసుకున్న భారత్

ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మరోసారి భారత జట్టు అగ్రస్థానాన్ని హస్తగతం  చేసుకుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అధ్వర్యంలో వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ చేతిలో సిరీస్ కోల్పోయిన తర్వాత ఇండియా తన నెంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయింది. కానీ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో, కోల్పోయిన అగ్రపీఠాన్ని టీమిండియా మళ్లీ దక్కించుకుంది. కేవలం 15 రోజుల్లోనే ఇంగ్లాండ్ ఆధిపత్యానికి బ్రేక్ వేసి ఇండియా మళ్లీ తొలి ప్లేస్ లో నిలిచింది. 

అగ్రపీఠం కోల్పోయిన భారత్: 
భారత్ 2022లో తొలిసారి టీ20 వరల్డ్ నెంబర్1 జట్టుగా అవతరించింది. అనంతరం వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్‌లను కూడా గెలుచుకుని సంచలనం సృష్టించింది. కానీ జట్టు కెప్టెన్ మారిన తర్వాత పరిస్థితి కొద్దిగా చేంజ్ అయింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. జూలై 11వ తేదీన ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో ఓడిపోవడంతో ఇండియా రెండో స్థానానికి పడిపోగా, ఇంగ్లాండ్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. 

జస్ట్ 15 రోజుల్లో మళ్లీ ప్రపంచ నెంబర్ 1గా భారత్: 
కేవలం 15 రోజుల్లోనే టీమిండియా మళ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ 16,088 పాయింట్లు, 268 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ 10,186 పాయింట్లు, 268 రేటింగ్‌తో రెండో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో, న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలవగా, సౌతాఫ్రికా ఐదో స్థానంలో ఉంది. 

జింబాబ్వేపై సిరీస్ విజయం: 
జింబాబ్వే టూరులో తొలి టీ20ని 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్, శనివారం జరిగిన రెండో టీ20లో ఏకంగా 90 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 219 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో ఇషాన్ కిషన్ (81 పరుగులు), తిలక్ వర్మ (60 పరుగులు) హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 129 రన్స్ కే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో విఫలమైన అభిషేక్ శర్మ బౌలింగ్‌లో 3 వికెట్లు తీసుకోగా, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–0 తేడాతో సొంతం చేసుకుంది.