మహారాష్ట్రలో మళ్ళీ మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని భామ్రాగడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ హక్కుల పరిరక్షణ కోసం, స్థానిక సమస్యలపై నిరసనగా ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ పోస్టర్లు విడుదల చేసింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ జులై 30 వరకు గడ్చిరోలి వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు.
అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రవాణా, వ్యాపార సముదాయాలు మూసివేయాలని పోస్టర్లలో పేర్కొన్నారు మావోయిస్టులు. దీంతో అలర్ట్ అయ్యారు గడ్చిరోలి పోలీసులు, సీ 60 కమాండో దళాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాడులుఎం జరగకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. భామ్రాగడ్, అహేరి, ఏటపల్లి అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు.
మావోయిస్టుల బంద్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని.. భయాందోళనలు అవసరం లేదని, ఏజెన్సీ ప్రాంతాలు పూర్తిగా పోలీసుల కంట్రోల్ లో ఉందని తెలిపారు అధికారులు.
