హైదరాబాద్: హైదరాబాద్ AIG హాస్పిటల్కు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన తన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణను పరామర్శించేందుకు AIGకి వెళ్లారు. సినిమా షూటింగ్లో నందమూరి బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏఐజీలో బాలకృష్ణ చికిత్స తీసుకుంటున్నారు. గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కాకినాడ పోర్టు పరిసరాల్లో శరవేగంగా జరుగుతుండగా బాలయ్య గాయపడ్డాడు.
భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణ కాలుజారి కిందపడటంతో ఆయన మోకాలికి స్వల్ప గాయం అయింది. ప్రమాదాన్ని గమనించిన చిత్ర బృందం వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్లోని ఏఐజీకి తరలించారు.
►ALSO READ | పెద్ది సుదర్శన్ రెడ్డికి హార్ట్ స్ట్రోక్.. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలింపు
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తిగా కొత్త స్టైలిష్ అవతారంలో దర్శకుడు గోపీచంద్ మలినేని చూపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. అత్యాధునిక యాక్షన్ కొరియోగ్రఫీతో రూపొందుతున్న యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం భావిస్తోంది.
