పెద్ది సుదర్శన్ రెడ్డికి హార్ట్ స్ట్రోక్.. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలింపు

పెద్ది సుదర్శన్ రెడ్డికి హార్ట్ స్ట్రోక్.. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలింపు

హనుమకొండ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి నుంచి అంబులెన్స్ బయల్దేరింది. పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్య పరిస్థితి తెలిసి హుటాహుటిన హాస్పిటల్కు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు కాన్వాయ్లో హైదరాబాద్కు బయల్దేరారు.

హనుమకొండ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రీన్ ఛానెల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన:
* పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది 
* హార్ట్ స్ట్రోక్తో ఆస్పత్రికి తీసుకువచ్చారు
* హార్ట్లో పల్స్ ఉంది.. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించాము

Dr.మమతా రెడ్డి, కార్డియాలజిస్ట్:
* పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య నిలకడగా ఉంది
* వదంతులు నమ్మవద్దు. మొత్తం పదిసార్లు CPR చేశాము
*  ట్రీట్మెంట్కు సహకరిస్తున్నారు
* మెరుగైన వైద్యసేవల కోసం హైద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తున్నాము
* దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దు