నిజామాబాద్, వెలుగు: హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో గోమాత పాత్ర ఎంతో కీలకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ముక్కోటి దేవతలను గోవులో చూస్తామన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రముఖ వక్త చాగంటి కోటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన గోమాత వైభవం ప్రవచనాల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సనాతన ధర్మ పరిరక్షణకు చాగంటి చేస్తున్న యజ్ఞం ఎంతో గొప్పదని, తన ప్రసంగాలతో లక్షలాది మందిలో అధ్యాత్మిక చైతన్యం నింపుతున్నారని కొనియాడారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
