కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి ఏఈవో మౌనికను సస్పెండ్‌చేస్తూ అగ్రికల్చర్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైతు భరోసా నిధుల మళ్లింపు వ్యవహారంలో ఈ చర్యలు తీసుకున్నారు.
రాజంపేట మండలం కొండాపూర్ పరిధిలోని షేర్శంకర్ తండాకు చెందిన రైతు కిషన్‌కు 1.02 ఎకరాల భూమి ఉండగా కొంతకాలంగా రైతు భరోసా పైసలు రాకపోవటంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ డబ్బులు గతంలో కొండాపూర్ఏఈవోగా పని చేసిన మౌనిక అకౌంట్లో జమ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో మౌనికను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏఈవో అకౌంట్లో జమైన పైసలను సదరు రైతుకు ఇవ్వనున్నట్లు అగ్రికల్చర్ఆఫీస్ వర్గాలు పేర్కొన్నాయి.
