బాక్సాఫీస్ వద్ద ఒక చిన్న చిత్రం పెద్ద సినిమాలకు షాక్ మీద షాక్ ఇస్తోంది. భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో రికార్డులు సృష్టిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అదే నీమ్ కరోలి బాబా జీవిత స్ఫూర్తితో తెరకెక్కిన భక్తి ప్రధాన చిత్రం 'హనుమాన్ అంశ్'. ఆగస్టు 7న కేవలం రూ.10 లక్షల ఓపెనింగ్‌తో మొదలైన ఈ సినిమా.. 35 రోజులు పూర్తయ్యేసరికి ఇండియా గ్రాస్‌ను ఏకంగా రూ.192.75 కోట్లు రాబట్టింది.
కేవలం రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. 35 రోజులు పూర్తి చేసుకుని ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కు వైపు దూసుకెళ్తోంది. ఆధ్యాత్మిక శక్తి నేపథ్యంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో, శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సెంసేషనల్ డివోషనల్ డ్రామా అందరి ప్రశంసలు పొందుతోంది. తొలి రోజు కేవలం రూ.10 లక్షల ఓపెనింగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. మొదటి రెండు వారాలు మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకున్న ఈ చిత్రం, 17వ రోజు రూ. 2 కోట్ల మైలురాయిని దాటింది.
ఇక మూడో వారం నుంచి థియేటర్లలో భక్తులు, ప్రేక్షకుల రద్దీతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది. 24వ రోజున ఏకంగా రూ.12.75 కోట్లు, 32వ రోజున అత్యధికంగా రూ22.75 కోట్ల కలెక్షన్‌తో ట్రేడ్ పండితులనే దిగ్భ్రాంతికి గురిచేసింది. 35వ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా 7,664 షోలతో నిలకడగా రూ.10 కోట్లు రాబట్టింది. భారతదేశ నెట్ కలెక్షన్ల రూపంలో రూ163.13 కోట్లు వసూళ్లు చేసింది.. అంటే బడ్జెట్‌పై ఏకంగా 96 రెట్ల లాభం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.
ఈ విజయానికి మౌత్ పబ్లిసిటీ ప్రధాన కారణంగా నిలిచిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, హీరో శోబినవ్ సత్యా అసలు నటుడు కాదు.. సినిమాకు సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ అనూహ్యంగా నీమ్ కరోలి బాబా పాత్రలోకి వచ్చారు. అసలు హీరో అనారోగ్యానికి గురికావడంతో దర్శకుడు విషాల్ చతుర్వేది అతడిని దాదాపు ఐదు గంటలు ఆడిషన్ చేసి ఎంపిక చేశారు.
మరోవైపు ఈ అపూర్వ విజయం కేవలం ఆరంభం మాత్రమే. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా నిర్మిస్తున్నట్లు సహ నిర్మాత నమ్రతా సింగ్ వెల్లడించారు. సెప్టెంబర్ 11 నుంచి హోంబలే ఫిల్మ్స్ ద్వారా ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని అంతర్జాతీయంగా విడుదలవుతోంది. మూడో భాగంలో స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్ బర్గ్, జూలియా రాబర్ట్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలపై నీమ్ కరోలీ బాబా చూపిన ఆధ్యాత్మిక ప్రభావాన్ని, భారతీయ దివ్యత్వాన్ని ప్రపంచ వేదికపై మరింత గ్రాండ్‌గా ఆవిష్కరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఆధ్యాత్మిక పరవశాన్ని నింపుతోంది.
