కరోనాతో అధ్వాన్నంగా మారిన ట్రూజెట్

కరోనాతో అధ్వాన్నంగా మారిన ట్రూజెట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ ట్రూజెట్ తన సర్వీస్‌‌‌‌లను ఆపేసింది. కంపెనీ సీఈఓ, సీఎఫ్‌‌‌‌ఓ, సీసీఓలు కూడా రాజీనామా చేశారు. ట్రూజెట్ ఏడు విమానాలను ఆపరేట్ చేస్తోంది. ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చినా ఈ రీజినల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ పరిస్థితి, కరోనాతో మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. డిమాండ్​ తగ్గింది. అద్దెలు రాకపోవడంతో ఏడింటిలో ఐదు విమానాలను వీటిని అద్దెకు ఇచ్చిన వారు వాపసు తీసుకున్నారు. గత నెల రోజుల నుంచి ట్రూజెట్ టాప్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కంపెనీని విడిచిపెడుతుండగా, గత మూడు నెలల నుంచి ఉద్యోగులకు శాలరీలను ఇవ్వడంలో ట్రూజెట్ ఇబ్బంది పడుతోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ట్రూజెట్‌‌‌‌ 2015, జులైలో తన సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేసింది. ట్రూజెట్‌‌‌‌లో మేఘా ఇంజినీరింగ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌కు 90 శాతం వాటా ఉంది. రామ్‌‌‌‌చరణ్‌‌‌‌కు ఈ కంపెనీలో వాటాలుండగా, ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్‌‌‌‌గా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉడాన్ స్కీమ్‌‌‌‌తో కంపెనీ పుంజుకుంటుందన్న టైమ్‌‌‌‌లో కరోనా వచ్చి పడింది.   ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేకపోవడంతో కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. తన సర్వీస్‌‌‌‌లను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికే  ఎయిర్‌‌‌‌‌‌‌‌ కోస్టా, ఎయిర్‌‌‌‌‌‌‌‌ పెగాసెస్‌‌‌‌, పారమౌంట్‌‌‌‌, ఎయిర్ కార్నివాల్‌‌‌‌ వంటి రీజినల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు వచ్చినప్పటికీ నిలబడలేదు. తాజాగా ట్రూజెట్‌‌‌‌ కూడా అదే బాట పట్టింది. ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ బిజినెస్ మ్యాన్‌‌‌‌ లక్ష్మీ ప్రసాద్ ట్రూజెట్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.