- ముష్కిన్చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో షెడ్ల వాసులకు అధికారుల హెచ్చరిక
- 17 రోజులు దాటినా ఖాళీ చేసింది10 శాతమే
- రియల్టర్ల మాటలు నమ్మితే నష్టపోతారని ప్రజలకు సూచన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ముష్కిన్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తాత్కాలిక షెడ్లలో ఉన్న వారు ఖాళీ చేయాలని చెప్పి 17 రోజులు గడిచిపోయాయని, రెండు రోజుల్లో స్వచ్ఛందంగా ఖాళీ చేయకపోతే షెడ్లను తొలగిస్తామని హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు శనివారం హెచ్చరించారు. ఇదివరకే ఒకసారి ఎఫ్టీఎల్పరిధిలో ఉన్నవాళ్లకు చెప్పిన అధికారులు ఆదివారం మళ్లీ షెడ్లలో ఉంటున్న వారి దగ్గరకు వెళ్లి ఖాళీ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కొందరు రియల్టర్లు చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో తాత్కాలిక షెడ్లల్లో ప్రజల్ని ఉంచి భూములను కొట్టేయాలని చూస్తున్నారని, ఇదివరకే నిర్మాణ వ్యర్థాలు, మట్టి పోసి..చెరువు స్వరూపాన్ని మార్చేశారని, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి తీసుకువచ్చి చెరువు పరిధిలో వేస్తున్నారన్నార. షెడ్లతో తాత్కాలిక ఇండ్లు, దుకాణాలను పెట్టించి ఆక్రమణలకు అడ్డుగా అమాయకపు జనాలను ఉంచుతున్నారన్నారు. ఏప్రిల్ 29న వెళ్లి అవగాహన కల్పిస్తే కేవలం 10 శాతం మంది మాత్రమే ఖాళీ చేశారని చెప్పారు. సమయం అయిపోయిందని ఎఫ్‌టీఎల్ పరిధిలోని తాత్కాలిక షెడ్లను ఎప్పుడైనా తొలగిస్తామని అక్కడి వారితో చెప్పారు.
