ఐబీఎంతో చేతులు కలిపిన తెలంగాణ ప్రభుత్వం

ఐబీఎంతో చేతులు కలిపిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) తో పనిచేయనున్నట్లు ప్రకటించిన ఐబీఎం

30 వేల మంది స్టూడెంట్స్‌‌కు కొత్త స్కిల్స్‌‌ కోసం

హైదరాబాద్‌‌, వెలుగు:  స్టూడెంట్స్‌‌ టెక్నికల్‌‌, ప్రొఫెషనల్‌‌ స్కిల్స్‌‌ పెంపొందించడానికి ఐబీఎంతో  తెలంగాణ ప్రభుత్వం చేతులు కలిపింది. తెలంగాణ అకాడమీ ఫర్‌‌ స్కిల్‌‌ అండ్‌‌ నాలెడ్జ్‌‌ (టాస్క్‌‌)తో కలిసి పనిచేయనున్నట్లు ఐబీఎం ఈ సందర్భంగా తెలిపింది. తమ ఫ్రీ డిజిటల్‌‌ ఎడ్యుకేషన్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ ఎమర్జింగ్‌‌ టెక్నాలజీస్‌‌పై శిక్షణ ఇవ్వగలదని, ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ ఓపెన్‌‌ పీ–టెక్‌‌ను టాస్క్‌‌కి అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. 30 వేల మంది ఇంజినీరింగ్‌‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌‌ స్టూడెంట్స్‌‌కు ఏడాది కాలంలో స్కిల్స్‌‌ పెంపొందించనున్నట్లు వెల్లడించింది. తమ ప్లాట్‌‌ఫామ్‌‌ ఉపయోగించడానికి అవసరమైన శిక్షణను ఆయా కాలేజీలలోని టీచర్లకు ఇవ్వనున్నట్లు పేర్కొంది. టాస్క్‌‌తో ఐబీఎం చేతులు కలపడం సంతోషం కలిగిస్తోందని తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్‌‌ రంజన్‌‌ తెలిపారు. సైబర్‌‌ సెక్యూరిటీ, బ్లాక్‌‌చెయిన్‌‌, ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌, మెషిన్‌‌ లెర్నింగ్‌‌, క్లౌడ్‌‌, ఇంటర్‌‌నెట్‌‌ ఆఫ్‌‌ థింగ్స్‌‌తోపాటు, డిజైన్‌‌ థింకింగ్‌‌ వంటి ప్రొఫెషనల్‌‌ స్కిల్స్‌‌నూ 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న స్టూడెంట్స్‌‌కు ఐబీఎం ప్లాట్‌‌ఫామ్‌‌ అందిస్తుంది.