మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి

మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి

ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్లు ఓ భాగమయ్యాయి. భారతదేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో వేగంగా పెగుతుందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు..సెల్ఫోన్లు కేవలం కాల్స్ చేయడానికి మాత్రమేకాదు..ఆన్లైన్ చెల్లింపులు, సోషల్ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ ఇలా రకరకాల అవసరాల కోసం వినియోగిస్తుంటాం.. కొన్ని కొన్ని సార్లు మన కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ కాల్ చేసుకోవడానికో.. లేదా ఏదైన సెర్చ్ చేయడానికో ఇస్తుంటాం.. అలాంటి సందర్భాల్లో వారు మీ ఫోన్ లో ఏయే యాప్ లు చూశారు.. ఎంతకాలం వాటిని వినియోగించారు ఇలా అనేక విషయాలను తెలుసుకోవాలంటే.. ఏంచేయాలో తెలుసుకుందాం.. 

మీరు మీ స్మార్ట్ ఫోన్ మొత్తం చరిత్రను తెలుసుకోవాలంటే.. ఓ సీక్రెట్ కోడ్ ఉంది. దీనిని యాక్సెస్ చేయడానికి మీ స్మార్ట్ ఫోన్ లోని డయల్ ప్యాడ్ ని తెరిచి USSD కోడ్ *#*4636#*#* ని డయల్ చేయాలి . 

ఈ కోడ్ డయల్ చేయగానే మూడు ఆప్షన్లు గల విండో ఓపెన్ అవుతుంది. ఫోన్ సమాచారం, వినియోగ గణాంకాలు, WiFi సమాచారం ఆప్షన్లు ఉంటాయి. మీ ఫోన్ హిస్టరీని తెలుసుకోవాలంటే వినియోగ గణాంకాలపై క్లిక్ చేయాలి. ఈ పేజీలో డ్రాప్ డౌన్ జాబితాలో మూడు ఆప్షన్లు ఉంటాయి. వినియోగించిన యాప్ లు, ఎంతకాల వినియోగించారు.. సమయం  వంటి మొత్తం సమాచారం కోసం Sort by last time used పై క్లిక్ చేయాలి. ఇలా దశలను అనుసరించడం ద్వారా మీరు మీ ఫోన్ లోని ప్రతి యాప్ వినియోగం గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.