ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు (2026, అక్టోబర్)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 1.
ఖాళీలు: 70. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు (2026, అక్టోబర్).
విభాగాల వారీగా ఖాళీలు: ఎన్సీసీ మన్ (జనరల్ క్యాటగిరీ) 63. యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుల వివాహం కాని పిల్లలకు 7 పోస్టులు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎన్ సీసీ సీనియర్ డివిజన్/ వింగ్‌లో కనీసం రెండు/మూడేండ్లు పనిచేసి ఉండాలి. ఎన్సీసీ ‘సి’ సర్టిఫికెట్ పరీక్షలో కనీసం 'బీ' గ్రేడ్ పొంది ఉండాలి. అప్లికేషన్ చివరి తేదీ నాటికి ఎన్సీసీ 'సీ' సర్టిఫికెట్ లేదా తాత్కాలిక ఎన్సీసీ 'సీ' సర్టిఫికెట్ లేని అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు కారు.
వయోపరిమితి: 2026, జులై 1 నాటికి 19 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. లేదా 2001, జులై 02 కంటే ముందు గానీ 2007, జులై 1 తర్వాత గానీ జన్మించిన వారై ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 12.
లాస్ట్ డేట్: మార్చి 16.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ: 2026, మే/ జూన్.
సెలెక్షన్ ప్రాసెస్: ఎన్సీసీ సర్టిఫికెట్, గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్లో ఏ గ్రేడ్ సాధించిన వారికి 50 మార్కులు, బీ గ్రేడ్ సాధించిన వారికి 25 బోనస్ మార్కులు ఇస్తారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ స్ఎస్బీ ఇంటర్వ్యూ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనంతరం అభ్యర్థులను ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు (2026, అక్టోబర్) ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో 49 వారాలపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలంలో ప్రతి నెలా రూ.56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
