న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాక్ హై ఓల్టేజ్ మ్యాచుకు ముందే మాటల యుద్ధం మొదలైంది. ఇరుదేశాల తాజా, మాజీ ప్లేయర్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై పాక్ మాజీ పేసర్ అమీర్ చేసిన వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభిషేక్ శర్మ మరోసారి పాకిస్తాన్‌ను చీల్చి చెండాడుతాడని హెచ్చరించారు.
అభి బెస్ట్ బ్యాటర్ అని.. గ్రౌండ్ నలువైపులా అతడు షాట్లు ఆడగలడని కితాబిచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో అభిషేక్ ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. అతడు ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థులకు చుక్కలేనని హెచ్చరించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలో జరగనున్న మ్యాచులో అభి క్రీజులో కుదురుకుంటే పాకిస్తాన్ నుంచి మ్యాచ్ దూరం చేయగలడని హెచ్చరించాడు. ఆసియా కప్ ప్రదర్శనతో గత 4–5 నెలలుగా అతను పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు.. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌పై భారీ ఇన్సింగ్స్ ఆడితే మరో 6 ఆరు నెలలు పాకిస్తాన్‌కు పీడ కలేనని వార్నింగ్ ఇచ్చాడు భజ్జీ.
అభిని అమీర్ ఏమన్నాడంటే..?
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై పాక్ మాజీ బౌలర్ అమీర్ నోరు పారేసుకున్నాడు. అభిషేక్ పెద్ద ఆటగాడేం కాదని.. అతడి టెక్నిక్ చాలా బలహీనంగా ఉందని ప్రగల్భాలు పలికాడు. అభిషేక్ ఒక స్లాగర్ అని.. అతను ప్రతి బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తాడన్నారు. ఇలాంటి ఆటగాళ్లు ఎక్కువసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు.
ఏదో ఒక మ్యాచులో భారీ ఇన్సింగ్స్ ఆడినా.. ఆ తర్వాత తక్కువ సోర్లకే ఔట్ అవుతాడన్నాడు. శరీరానికి దగ్గరగా బంతులు వేస్తే అతడిని ఇబ్బంది పెట్టవచ్చని బౌలర్లకు సూచించాడు. అభిషేక్ శర్మ టెక్నిక్ ఇంకా మెరుగుపర్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. అమీర్ వ్యాఖ్యలపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు భగ్గుమంటున్నారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అభి ఊచకోతను మర్చపోలేకే.. అతడిపై విషం చిమ్ముతున్నారని కౌంటర్ ఇస్తున్నారు.
