LSG vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. గెలిస్తే ప్లే ఆఫ్ కు

LSG vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. గెలిస్తే ప్లే ఆఫ్ కు

ఐపీఎల్ లో మరో ఆసక్తికర సమరం ప్రారంభం కానుంది. లక్నో సూపర్ జయింట్స్ తో  రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. లక్నోలోని ఏకేన క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ లాడిన రాజస్థాన్ రాయల్స్ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు లక్నో ఆడిన 8 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దాదాపుగా కన్ఫర్మ్ చేసుకుంటుంది.   


రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): 

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్ ), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్, KL రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్